Tuesday, May 21, 2024
- Advertisement -

బాబు మాటలపై ఆ కులసంఘం మండిపాటు!

- Advertisement -

మీరు మీరు.. ఎలాగైనా తిట్టుకోండి.. ఏమైనా చేసుకోండి.. మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు? అని అంటూ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు యాదవ, కురుమ సంఘాల వారు.

తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాటలు వీరిని ఇబ్బంది పెడుతున్నాయి. బాబు తమ కుల వృత్తిని అవమానిస్తున్నాడని వారు అంటున్నారు.

ఇంతకీ బాబు ఏమన్నాడంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తన సహజశైలిలో దుమ్మెత్తిపోస్తూ.. తన వల్లనే కేసీఆర్ పేరు తెచ్చుకొన్నాడని.. తన వల్లనే ఎదిగాడని అంటున్న బాబు “తెలుగుదేశం లేకపోతే కేసీఆర్ గొర్రెలు కాసుకోవాల్సి వచ్చేది..” అన్నాడు. మరి బాబుకు ఈ మాట సబబుగానే అనిపించింది. కేసీఆర్ కు రాజకీయ జన్మం ఇచ్చింది తెలుగుదేశమేనని.. లేకపోతే కేసీఆర గొర్రెలు కాసుకోవాల్సి వచ్చేది..అని అన్నాడు.

మరి బాబుకు ఇందులో తప్పులేకపోవచ్చు కానీ.. ఆ వృత్తిలో ఉన్న వారికి మాత్రం ఇది తిట్టుతో సమానం. బాబు తన మాటలతో ఆ వృత్తిలో ఉన్నవారిని అవమానించారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో అనేక కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉంటాయి. అది లాభసాటి వృత్తి కూడా. మంసోత్పత్తితో కూడా గొర్రెల పెంపకం దార్లది ముఖ్యమైన పాత్ర. మరి అలాంటి పనిని బాబు తక్కు చేసి చూపిస్తున్నాడు. కేసీఆర్ గొర్రెలను కాసుకోవాల్సి వచ్చేది అన్నాడు. దీంతో ఆ వృత్తిలో ఉన్నవారికి కోపం వచ్చింది. బాబు తమ వృత్తిని అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -