Monday, May 20, 2024
- Advertisement -

త‌ల్లిమృత‌దేహంతో 18 రోజులు గ‌డిపిన కొడుకు ఎందుకో తెలుసా..?

- Advertisement -

ప్ర‌పంచం శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో దూసుకు పోతున్నా ముఢ న‌మ్మ‌కాలను మాత్రం ప్ర‌జ‌లు వ‌ద‌ల‌డంలేదు. చ‌నిపోయిన త‌ర్వాత వారిని ఖ‌న‌నం చేయ‌డ‌మో లేకా కాల్చ‌డ‌మో చేయ‌డం ఆన‌వాయితీ. కానీ మూడ‌న‌మ్మ‌కాల‌తో ఓకొడుకు చ‌నిపోయిన త‌ల్లిశ‌వంతో 18 రోజులు గ‌డిపాడు. ఈ సంఘటన కోల్ కత్తాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అలాంటి ప‌ని ఎందుకు చేశావ‌ని ఆడిగితే దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చాడు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం….కోల్ కతా లోని సాల్ట్ లేక్ కు చెందిన 38 సంవత్సరాల మైత్రేయ భట్టాచార్య ఈ ఘటనకు పాల్పడ్డాడు. వృత్తి రీత్యా న్యూరో సర్జన్ అయిన అతని తండ్రి జీసీ భట్టాచార్య ఆరేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి తల్లి కృష్ణ (77)తో కలిసి ఉంటున్నాడు మైత్రేయ. అత‌ను నిరుద్యోగి. దీంతో.. తండ్రికి వచ్చే పెన్షన్ తోనే తల్లితో కలిసి జీవించేవాడు. ఇటీవల ఆమె జబ్బు పడి మరణించింది.

ఆమె మరణించి దాదాపు 18 రోజులు గడుస్తున్నా.. అతను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడం గమనార్హం.తల్లి మృతదేహాన్ని ఖననం చేసే విషయంలో మైత్రేయ తాను నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరించాలనుకున్నాడు. ఈ క్రమంలో 21 రోజుల పాటు ఆ మృతదేహాన్ని ఖననం చేయకుండా ఉంచాలని చూశాడు. అయితే ఇంటినుంచి దుర్వాస‌న రావ‌డంతో చుట్టు ప‌క్క‌ల వాళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది.

దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి కృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇలా ఎందుకు చేశావ‌ని పోలీసులు ప్ర‌శ్నించ‌డంతో దిమ్మ‌తిరిగే నిజాలు చెప్పారు. ఇరవై ఒక్కరోజుల తర్వాత మృతదేహాన్ని ఖననం చేస్తే మంచిదని, అందుకే, ఆ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని అతని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారని పోలీసుల సమాచారం.

కోల్‌కతాలో ఇటువంటి సంఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శుభబ్రత మజుందార్ అనే 43 ఏళ్ల వ్యక్తి తన 84 ఏళ్ల తల్లి శవాన్ని మూడేళ్ల పాటు ఫ్రిజ్‌లో భద్రపరచినట్లు పోలీసులు కనుగొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నా ముఢ‌న‌మ్మ‌కాల‌ను మాత్రం వ‌ద‌ల‌డంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -