ఐస్‌క్రీంలో బల్లి తోక..వైరల్ న్యూస్!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓ ఐస్ క్రీం షాప్‌లో కోన్ ఐస్‌క్రీం కొనుగోలు చేయగా చివరలో బల్లి (లిజార్డ్) తోక కనిపించింది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు.

వివరాల్లోకి వెళ్తే… అహ్మదాబాద్ నగరంలోని మణినగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ…. మహాలక్ష్మీ కార్నర్‌ అనే ఐస్‌క్రీమ్ షాపు నుండి నాలుగు కోన్ ఐస్‌క్రీంలను కొనుగోలు చేసింది. ఆమె తన పిల్లలతో కలిసి ఐస్‌క్రీం తింటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఐస్‌క్రీం తినే క్రమంలో క్షుణ్ణంగా పరిశీలించగా అందులో పాము తోకలా కనిపించింది. కొద్ది సమయానికే ఆమెకు తీవ్ర కడుపునొప్పి, వాంతులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటనపై ఆ మహిళ … అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC)కి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. మహాలక్ష్మి కార్నర్ దుకాణాన్ని ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం మూసివేశారు. హావ్‌మోర్ ఐస్‌క్రీం బ్రాండ్‌కు ₹50,000 జరిమానా విధించారు.