Monday, April 29, 2024
- Advertisement -

నరేంద్ర మోడి : కాంగ్రెస్ కు ఓటు వేస్తే అంతే సంగతులు!

- Advertisement -

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గుజరాత్ చుట్టూ పోలిటికల్ హిట్ పెరుగుతోంది. డిసెంబర్ 1న మొదటి దశ పోలింగ్ జరగనుండగా, 2న రెండవ దశ పోలింగ్ జరగనుంది. ఈసారి గుజరాత్ లో ముఖ్యంగా త్రిముఖ పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ చక్రం తిప్పుతోంది. మరి ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీకి తిరుగుండదా లేక ప్రజలు వేరే పార్టీకి ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు నేషనల్ మీడియా లో ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారలతో హోరెత్తిస్తున్నాయి. ఇక ఇటీవల అమ్రౌలిలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడి పాల్గొన్నారు. .

ఈ సందర్భంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి అనవసరంగా ఓటు వృధా చేసుకోవద్దని, ఎందుకంటే కాంగ్రెస్ వద్ద అభివృద్దికి సంబంధించిన ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని మోడి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే ఎలాంటి యూస్ ఉండదని, అవి ఎప్పటికీ మేలు చేయలేవని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అంతరించి పోతున్న పార్టీ అని, ఆ పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోవద్దని మోడి సూచించారు. ఇక గుజరాత్ ఎన్నికల వేళ ఈసారి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది బీజేపీ. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా ఈసారి కొత్తవారిని బరిలోకి దించేందుకు సిద్దమౌతోంది. ఇప్పటికే 40 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టింది కాషాయ పార్టీ. ఇక ఇటీవల మరో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కూడా సస్పెన్షన్ విధించింది. మరి ఈసారి గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

పవనే కరెక్ట్.. నేను కాదు: చిరంజీవి!

అప్పుడు జగన్ అపవిత్రం.. ఇప్పుడు బాబు అపవిత్రం!

చంద్రబాబు ఒంటరి పోరు సాధ్యమేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -