Tuesday, April 30, 2024
- Advertisement -

ఈసారి డౌటే.. అమిత్ షా వ్యూహాలు ఫలిస్తాయా?

- Advertisement -

దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న గుజరాత్ ఎన్నికలు మరో పది రోజుల్లో జరగనున్నాయి. ఈసారి గుజరాత్ ప్రజలు ఏపార్టీకి పట్టం కాడరనేది దేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత పాతికేళ్ళకు పైగా ఇక్కడ కమలం పార్టీ హవానే కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కూడా గుజరాత్ లో బలమైన క్యాడర్ ఉన్నప్పటికి మోడీ మ్యానియా ముందు పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈసారి కూడా గుజరాత్ లో మోడీ మ్యానియాపైనే ఆధార పడింది కాషాయదళం. అయితే ఈసారి మోడీ మ్యానియా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనేది కొందరు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఈసారి బీజేపీ ప్రభుత్వంపై రైతుల్లోనూ, మైనార్టీలలోనూ అలాగే యువతలోనూ కొంత వ్యతిరేకత కనిపిస్తోంది.

గుజరాత్ ఓటర్లలో చాలా వరకు రైతులే అధికంగా ఉన్నారు. గత కొన్నాళ్లుగా ప్రభుత్వం పంట నష్ట పరిహారాలు ఇవ్వడంలో జాప్యం చేస్తోందనే అసంతృప్తి రైతుల్లో అధికంగా ఉంది. అలాగే పలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతుల భూములు అక్రమంగా సేకరించడం వంటి అంశాలు కూడా రైతుల్లో వ్యతిరేకతకు కారణమౌతోంది. ఇక గుజరాత్ యువత కూడా బీజేపీ ప్రభుత్వంపై కాస్త గుర్రుగానే ఉన్నారు. సరైన టైమ్ లో జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయకపోవడం, ఇక ఆయా సందర్భాలలో పరీక్ష పాత్రలు లీక్ కావడం, పరీక్షలు వాయిదా పడడం వంటి వాటిపై విద్యార్థుల్లో ప్రభుత్వంపై నిరసన పెరుగుతోంది. ఇక బిల్కిస్ గ్యాంగ్ రేప్ కేస్ లో నిందితులను విడిచిపెట్టడం, భాదితురాలికి న్యాయం జరగకపోవడంతో మైనారిటీలలో కూడా బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది.

ఇదంతా కూడా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా గత పాతికేళ్ళకు పైగా ఇక్కడ బీజేపీ మాత్రమే అధికారంలో ఉంది. దాంతో ఈసారి ప్రజలు మార్పు కోరుకునే అవకాశం ఉందని కొందరి అంచనా. దాంతో ఈసారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. అయితే బీజేపీ తరువాత ఆ స్థాయిలో బలంగా కాంగ్రెస్ ఉన్నప్పటికి.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత సీన్ ఉందా అంటే చెప్పడం కష్టమే. ఇక ఈసారి ఎన్నికల రేస్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో ప్రభావం చూపకపోయినప్పటికి, బీజేపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పై మాత్రం ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈసారి బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తుండడంతో.. అమిత్ షా ఎలాంటి వ్యూహాలు రచిస్తాడు ? మోడీ మ్యానియా ఈసారి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మరి ఈసారి గుజరాత్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు బెదిరిస్తున్నారు .. జగన్ హాట్ కామెంట్స్!

కాంగ్రెస్ కు ఓటు వేస్తే అంతే సంగతులు!

పవనే కరెక్ట్.. నేను కాదు: చిరంజీవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -