Thursday, May 16, 2024
- Advertisement -

శంభో.. శివ శంభో..

- Advertisement -

దేశమంతటా ప్రజలు శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. 

అన్ని శైవ క్షేత్రాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని శివాలయాలూ భక్తులతో సందడిని సంతరించుకున్నాయి. భక్తుల పంచాక్షరి మంత్ర పఠనంతో శైవ క్షేత్రాలు పులకించి పోతున్నాయి. వారణాసి భక్తజన సంద్రమే అయింది. ఆంధ్రప్రదేశ్ లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు.  ఇక్కడి పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి.. శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుంటున్నారు. అటు వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలోనూ భక్తుల సందడి నెలకొంది. ఇక్కడైతే రాత్రి 2 గంటల నుంచే స్వామి వారి దర్శనానికి అనుమతించారు. ఇక పంచారామ క్షేత్రాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటల్లోని శివాలయాలకూ భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక తెలంగాణలోని వేములవాడ శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుంటూ రాజరాజేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.  అటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలంపూరు జోగులాంబ ఆలయమూ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడి పార్వతీపరమేశ్వరులతో పాటు నవబ్రహ్మలకూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ రాత్రి లింగోద్భవ వేడుకను కనులారా చూసేందుకు భక్తులు అన్ని శైవక్షేత్రాలకూ పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.  మొత్తానికి శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశమంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -