Wednesday, May 15, 2024
- Advertisement -

శివ‌భ‌క్తిలో మునిగిన పోలండ్ బుడ్డోడు

- Advertisement -

హిందూవుల ప‌ర్వ‌దినం మ‌హా శివ‌రాత్రి. శివుడు లింగాకారంలో మార‌డంతో మ‌హా శివ‌రాత్రిని భ‌క్తులు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో చేసుకుంటారు. ఈ సంద‌ర్భంగా మ‌హా శివ‌రాత్రి నాడు శైవ క్షేత్రాల‌న్ని కిట‌కిటాల‌డుతుంటాయి. భ‌క్తులంతా ఉప‌వాసం ఉండి ఆల‌యంలో నీల‌కంఠుడికి పూజ‌లు చేసి ఆ రోజంతా శివ‌నామ‌స్మ‌ర‌ణే వారికి ఆహారం. ఎంతో భ‌క్తి, నిష్ట‌ల‌తో మ‌హా శివ‌రాత్రి నాడు గడుపుతారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తి లోకంలో మునిగి ఉంటారు. భ‌క్తి గీతాలు, కీర్త‌న‌లు పాడుకుంటూ శివ‌నామ‌స్మ‌ర‌ణ చేస్తుంటారు. అయితే పోలండ్‌కు చెందిన కుర్రాడు కూడా శివ‌నామ‌స్మ‌ర‌ణ‌లో మునిగాడు.

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా పోలండ్‌కు చెందిన బిగ్నీవ్ చెర్టలూర్ (Zbigniew A. Chertlur) భ‌క్తి పార‌వ‌శ్యంలో ఉన్నాడు. ఏడేళ్ల పిల్లాడు శివుడికి మంగ‌ళ‌క‌ర‌మైన గొంతుతో ఓ పాట పాడాడు. క‌న‌రార కైలాస నివాస అని శివుడికి సంబంధించిన పాట పాడాడు. భ‌క్తిపూర్వ‌కంగా పాట పాడి భ‌క్తిని నిరూపించుకున్నాడు.

ఇంత‌కీ ఈ పిల్లాడు ఎవ‌రో అనుకుంటున్నారు. క‌దా! ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శరత్ చేర్తులూరు కుమారుడు బిగ్నివ్ చెర్ట‌లూర్‌. అతడి తల్లి పొలండ్ దేశస్తురాలు ఉర్సులా ఎలిజ్బెతియా. వీరు అక్క‌డే నివ‌సిస్తూ తెలుగు రాష్ట్రాల‌పై అభిమానం ఉంది. ఇటీవ‌ల గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా వందేమాత‌రం, ప‌వ‌న్‌పై ఓ ప్ర‌త్యేక పాట పాడాడు. అంత‌కుముందు ప‌లు పాట‌లు పాడి అంద‌రీ దృష్టిని ఆక‌ర్షించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -