Thursday, April 25, 2024
- Advertisement -

IND vs AUS : నేటి మ్యాచ్ లో బుమ్రా.. ఆ లోటు భర్తీ చేస్తాడా ?

- Advertisement -

ఇండియా , ఆస్ట్రేలియా మద్య నేడు నాగ్ పూర్ లో రెండో టి20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో ఆసీస్ టీమిండియా నిర్దేశించిన భారీ స్కోర్ ను కూడా ఆలోవోకగా చేధించడంతో నేడు రెండో టి20లో ఇరు జట్లు ఎలా రాణిస్తాయోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మొదటి మ్యాచ్ ఓటమి తరువాత రెండో మ్యాచ్ లో రోహిత్ సేన ప్రయోగాలకు పులిస్టాప్ పెట్టె అవకాశం గట్టిగా కనిపిస్తోంది. టీమిండియా బ్యాటింగ్ పరంగా అత్యంత పటిష్టంగా ఉన్నప్పటికి బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లో తేలిపోతోంది.

ఇప్పటికీ ఆసియా కప్ లో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం ఎలా ఉందో స్పష్టంగా కనిపించింది. సింపుల్ క్యాచ్ లను సైతం ఒడిసిపట్టలేకపోతున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఇక బౌలింగ్ లో కూడా ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో భారీగా పరుగులు సమర్పించుకుంటూ మ్యాచ్ లను ప్రత్యర్థి చేతిలో పెట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ తో రోహిత్ సేన నేడు జరిగే మ్యాచ్ తో తాడో పేడో తేల్చుకోనుంది. అయితే ఇప్పటివరకు రోహిత్ జట్టు కూర్పు విషయంలో అడపాదడపా ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. ఇక ఆసీస్ తో జరిగే రెండో టి20 మ్యాచ్ నుంచి జట్టు స్థిరత్వంపై దృష్టి పెట్టె అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా కు కాస్త బలనిచ్చే అంశం ఏమిటంటే రెండో మ్యాచ్ నుంచి యార్కర్ సంచలనం జస్ ప్రీత్ బుమ్రా చాలా రోజుల తరువాత జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. ఆసియాకప్ లో కూడా అందుబాటులో లేడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి రానున్నట్లు సూర్య కుమార్ యాదవ్ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఇక బుమ్రా రాకతో టీమిండియా బౌలింగ్ విభాగం బలంగా మారే అవకాశం ఉంది. అయితే బుమ్రా రాకతో ఉమేశ్ యాదవ్ లేదా భువనేశ్వర్ కుమార్ ఇద్దరిలో ఎవరో ఒకరికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా భావిస్తోంటే.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

( జట్టు అంచనా ) టీమిండియా : కే‌ఎల్ రాహుల్, రోహిత్ శర్మ ( కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హర్ధిక్ పాండ్య, దినేష్ కార్తీక్ ( కీపర్ ), అక్షర్ పటేల్,దీపక్ చహార్, యజువేంద్ర చహల్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్ / ఉమేశ్ యాదవ్.
( జట్టు అంచనా ) ఆస్ట్రేలియా : ఆరోన్ పించ్ ( కెప్టెన్ ), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లీస్, టిమ్ డేవిడ్, మ్యాథ్స్ వేడ్ ( కీపర్ ), పాట్ కమీన్స్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, జోష్ హజిల్ వుడ్, కెన్ రిచర్డ్ సన్, సీన్ అబాట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -