Thursday, May 16, 2024
- Advertisement -

పదవికి మరో ఎమ్మెల్యే రాజీనామా

- Advertisement -

సొంత జిల్లా కడపలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో కష్టం వచ్చి పడింది. మైదుకూరు తరఫున ఎమ్మెల్యేగా ఉన్న రఘురామిరెడ్డి.. తన పదవికి రాజీనామా చేయడం.. ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు ప్రొటోకాల్ పరంగా తగిన గౌరవం దక్కడం లేదని అలిగిన రఘురామిరెడ్డి.. స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు రాజీనామా లేఖ పంపించారు.

ఈ మధ్య రంజాన్ తోఫా కార్యక్రమంలో.. మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న తనను అగౌరవపరిచారని అధికారులపై ఫిర్యాదు చేస్తూ.. ఆయన స్పీకర్ కు రాసిన రాజీనామా లేఖలో చాలా విషయాలు ప్రస్తావించారు. ఓ మంత్రి వియ్యంకుడిని వైదికపైకి తన కన్నా ముందు పిలిచి.. అవమానించారని స్పీకర్ కు తెలిపారు.. రఘురామిరెడ్డి. ఈ విషయంలో తనను తక్కువ చేయడం సరికాదని.. అధికారులకు సూచించినా.. స్పందన రాలేదని వాపోయారు.

ఇదొక్కటే కాదనీ.. గతంలో ఏరువాక కార్యక్రమం సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు కూడా.. తనకు ఇలాగే ప్రొటోకాల్ విషయంలో కనీస గౌరవం ఇవ్వలేదని స్పీకర్ కు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పదవిలో కొనసాగలేకపోతున్నానని చెబుతూ.. రాజీనామా లేఖ పంపారు. దీంతో.. జగన్ కు సొంత జిల్లాలోనే మరో ఎమ్మెల్యే తగ్గినట్టయింది. ఈ పరిస్థతిని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related

  1. జగన్ , చంద్రబాబు ని తలదన్నేసిన కేటీఆర్
  2. గోల్ఫ్ ప్లేయర్ గా జగన్‍!
  3. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్!
  4. జగన్ కు మంత్రి హరీష్ హెచ్చరిక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -