Friday, May 17, 2024
- Advertisement -

అది ఒక్కడిది.. ఇది మాత్రం అందరిదా?

- Advertisement -

రాజకీయాల్లో అనుభవాన్ని బట్టి అభిప్రాయాలు.. సందర్భాన్ని బట్టి మాటలు మారిపోతుండడం చాలా సార్లే చూశాం. ఇప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి.. బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని వెనకేసుకు వచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎదురుదాడి నుంచి కేంద్రాన్ని ముందుండి నడిపించినట్టే.. ఇప్పుడు పార్టీలో మొదలైన అసంతృప్తి నుంచి మోడీని సేఫ్ గా బయటపడేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

2014లో జరిగిన జనరల్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టడంలో నరేంద్రమోడీ పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన కోటరీ కూడా అదే విషయాన్ని వీలైనపుడల్లా చెబుతూ వస్తోంది. గెలుపు క్రెడిట్ మొత్తం మోడీకే దక్కేలా చేసింది. పార్టీ నేతలు ఎంత కష్టపడినా.. సీనియర్ల సలహాలు సూచనలను ఎన్నికల ప్రచారంలో పాటించినా.. గెలుపు మాత్రం మోడీ ఖాతాలోకే వెళ్లింది. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం సీన్ మారింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి తలపండిన బీజేపీ పెద్దలు..  డైరెక్ట్ గా మోడీతో పాటు.. అమిత్ షాను టార్గెట్ చేస్తున్నారు. ఇదే టైమ్ లో.. వెంకయ్యనాయుడు సీన్ లో ఎంటరయ్యారు. పార్టీ ఓడిపోడానికి బాధ్యత అందరిదీ అంటూ.. ఇందులో మోడీ చేసిన తప్పేం లేదంటూ వీలు చిక్కినపుడల్లా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇదే.. బీజేపీ సీనియర్లలో అసహనానికి కారణమవుతోంది.

అందరి కష్టంతో పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ ఘనత మోడీకి దక్కింది. ఇప్పుడు బీహార్ లో అన్నీ తామై మోడీ, అమిత్ షా ప్రచారం చేసినా కూడా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఇందుకు సీనియర్లు ఎలా కారణం అవుతారన్న ప్రశ్న పార్టీలో ఓపెన్ గానే వినిపిస్తోంది. చాలా కాలంగా బీజేపీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ.. ఇప్పుడు కేంద్ర మంత్రి గా పని చేస్తున్న వెంకయ్యనాయుడు కూడా.. ఇలా మాటలు మార్చడం ఏంటంటూ కొందరు నాయకులు నిరసన గళం విప్పుతున్నారు. స్వామి భక్తి ఉండొచ్చు కానీ.. మరీ ఇంతలానా అంటూ విమర్శిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -