Thursday, May 16, 2024
- Advertisement -

నెటిజన్ల కట్టడికి కొత్త చట్టం తెస్తున్న మోడీప్రభుత్వం?!

- Advertisement -

మొత్తానికి ఇటీవల సుప్రీం కోర్టు  ఐపీసీ సెక్షన్ 66A ను తుడిచిపెట్టింది. ఇది భావస్వేచ్ఛకు అడ్డు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ చట్టం చెల్లదని స్పష్టం చేసింది.

 ఆ చట్టం రద్దును కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యం పై స్పందిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. దీంతో ఇంటర్నెట్ , మొబైల్ ఫోన్ల ద్వారా ప్రచురితం అయ్యే పోస్టులకు , మెసేజ్ లకు అడ్డంకులేమీ లేకుండా పోయాయి. ఈ చట్టం సరికాదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై స్పందిస్తూ సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. దీంతో నెటిజన్లు సంబరాలు చేసుకొన్నారు. 

ఇంత వరకూ ఈ సెక్షన్ కు భయపడి చాలా నియంత్రణలో ఉండాల్సి వచ్చేదని.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం ఉండేదని.. ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయని నెటిజన్లు అంటున్నారు.  నెటిజన్ల సంగతిలా ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఈ ఐటీ నియంత్రణ యాక్ట్ ను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయ్యింది. ఈ సెక్షన్ ను రద్దు చేయాలంటే దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం న్యాయవాదిని బరిలోకి దించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇప్పుడు ఈ సెక్షన్ ను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ వాళ్లు.. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తెగ రచ్చ చేశారు!

 ఈ సెక్షన్ ను రద్దు చేయాలని వీళ్లు అప్పట్లో గట్టి గా డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ లోని బ్లాగులు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, సెల్ ఫోన్ లోని మెసేజ్ లలో అసభ్య, అభ్యంతరకమైన వాటిని నియంత్రించడానికి అంటూ యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం అభ్యంతరకరమైన పోస్టులు లేదా మెసేజ్ లపై ఏవైనా ఫిర్యాదులు వస్తే.. ఆ పోస్టులను పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయడానికి అవకాశం ఉండేది. ఈ చట్టం అమల్లోకి వచ్చాకా అనేక మంది నెటిజన్లు ఉత్తి పుణ్యానికి అరెస్టయ్యారు! దీంతో ఇది భావస్వతంత్రానికి అడ్డుగా ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. అప్పట్లో భారతీయ జనతా పార్టీ కూడా వారితో జత కలిసింది. 

తీరా అధికారంలోకి వచ్చాకా మాత్రం బీజేపీ ఈ చట్టాన్ని కాపాడటానికే ప్రయత్నిస్తోంది. రద్దు అయిన చట్టాన్ని మరో పేరుతో తెస్తూ.. ఈ ఇంటర్నెట్ భావస్వేచ్ఛను కట్టడి చేయడానికి చట్టాన్ని తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది! ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ ఒక ప్రకటన చేశారు. మరి బీజేపీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా వ్యవహరించం ఏమిటో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -