తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవలకు ముక్కు పచ్చలారని పసివాడు బలయ్యాడు. అల్లారుముద్దుగా కొడుకును పెంచాల్సిన తల్లే క్షణికావేశంలో బాలిడి పాలిట మ్రుత్యువుగా మారింది. ఏడు నెలల తన కుమారుడిపై శానిటైజర్ పోసి తాను కూడా నిప్పంటించుకుంది. ఈ ఘటన హయత్ నగర్లో చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ముస్తాపల్లి తండాకు చెందిన వెంకటేష్ తో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బొడికొండ తండాకు చెందిన సువర్ణకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కన్నయ్య (ఏడునెలల బాబు) ఉన్నాడు.
ఇటీవల భార్యభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగున్నాయి . దీంతో మనస్తాపానికి గురైన సువర్ణ తనతో పాటు ఏడు నెలల బాబుపై శానిటైజర్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గమనించిన చుట్టు పక్కల వారు వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న కన్నయ్య మరణించాడు. సువర్ణ కోలుకుంటోంది.
శ్రీదేవి అక్క.. నాకు వరసకు పిన్ని..!