వరుణ్ తేజ్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

- Advertisement -

‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’చిత్రాల్లో నటించిన వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిల జోడీ మెప్పించింది. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారనే పుకార్లు కూడా వ్యాపించాయి. వరుణ్‌ తేజ్ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య హాజరయ్యారు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

తాజాగా వరుణ్‌ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో బెంగళూరు వెళ్లారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీంతో మరోసారి వీరి వివాహం వార్త రూమర్లు మొదలయ్యాయి. లావణ్యతో కలిసి బర్త్‌డే పార్టీ స్పెషల్‌గా చేసుకోవడానికే వరుణ్‌ బెంగళూరు వెళ్లారని, ఆమె కోసం అత్యంత ఖరీదైన డైమండ్‌ రింగ్‌ని కూడా కొనుగోలు చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

- Advertisement -

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై లావణ్య స్పందించారు. ఇలాంటి వార్తలకు తాను ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను డెహ్రాడూన్‌లో ఉన్నానంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతో తాను వరుణ్ బర్త్ డే వేడుకలకు వెళ్లలేదని ఆమె స్సష్టం చేశారు.

Also Read: చిరంజీవికే నో చెప్పింది.. మహేష్ బాబు పరిస్థితి ఏమిటో మరి..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -