Wednesday, May 22, 2024
- Advertisement -

తెలంగాణ కలెక్టర్ల ప్రతిపాదన

- Advertisement -

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్సాటు ప్రతిపాదన కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకూ తెలంగాణాలో మరో 15 కొత్త జిల్లాలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాత్రం ఆ సంఖ్యను 13కు కుదించాలని కలెక్టర్లు ప్రతిపాదించారు.

అలాగే తెలంగాణలో కొత్తగా తొమ్మిది డివిజన్లు, 74 కొత్త మండలాలను కూడా కలెక్టర్లు ప్రతిపాదించారు. ఇందుకోసం వారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  ఈ అంశంపై బుధవారం నాడు ఓ నిర్ణయానికి రానున్నారు. బుధవారం నాడు కలెక్టర్లు ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర‌్శ రాజీవ్ శర్మను కలిసి కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్షిస్తారు. అనంతరం ముఖ్యమంత్రితో వర్క్ షాపులో పాల్గొంటారు. అక్కడ మరింత మేథోమధనం జరిగిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టత వస్తుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -