Saturday, June 1, 2024
- Advertisement -

వీడ‌ని శ్రీదేవి డెత్ మిస్ట‌రీ…? భ‌ర్త బోనీకీ దుబాయ్ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌..!

- Advertisement -

శ్రీదేవి డెత్ మిస్ట‌రీలో ట్విస్ట్‌ల‌మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. గంట గంట‌కు మృతికి సంబంధించిన విష‌యాలు ఉత్కంఠ రేపుతున్నాయి. శ్రీదేవి దుబయిలోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ గదిలో హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. దుబయి సర్కారు ఆరోగ్య శాఖ ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించిందని నివేదిక ఇచ్చింది. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఆరోగ్యవంతమైన మహిళ టబ్ లో మునిగి చనిపోవటమేంటని, దాన్ని అధికారికంగా ఎలా నిర్థారించారని ప్రాసిక్యూషన్ వారు ప్రశ్నిస్తున్నారు.

ముందు గుండెపోటుతో చనిపోయిందంటూ ముందు కుటుంబ సభ్యులు తెలిపారు. మ‌రో విపు రిపోర్టులో ఆల్కహాల్ వుందంటూ రావటం, టబ్ లో ప్రమాదవశాత్తు మునిగిపోయిందంటూ రిపోర్ట్ రావటం ఇలా… రకరకాల కోణాల్లో ప్రశ్నలు తలెత్తుతుండటంతో కేసు విచారణ తీవ్రమైంది. డెత్ మిస్ట‌రీనీ ఛేధించేందుకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగంలోకి దిగింది.

శ్రీదేవిది ప్రమాదమా… ఆత్మ హత్యా.. లేక కుట్ర కోణమా అనేది అర్థం కాని సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో విచారణ ముమ్మరమైంది. దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ప‌లు అనుమానాలు తొల‌చి వేస్తున్నాయి. శ్రీదేవి మృతి కేసును సీరియస్ గా తీసుకున్న దుబయి ప్రాసిక్యూషన్ కేసు విచారణ ముమ్మరం చేసింది. విచారణ పూర్తయే వరకు బోనీ కపూర్ దుబయి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. మ‌రో వైపు విచార‌ణ పూర్తి అయ్యే వ‌ర‌కు శ్రీదేవి పార్థివ దేహాన్ని వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించేదిలేద‌ని దుబాయ్ ప‌బ్లిక్ ప్రాషిక్యూష‌న్ వెల్ల‌డించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -