Sunday, May 19, 2024
- Advertisement -

కొలుకునే అవకాశాలు లేవంటున్న విశ్లేషకులు

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ. దక్షిణాది రాష్ట్రాల్లో కనుమరుగు కానుందా. అలాగే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పెట్టని కోటగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు బీటలు వారింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అనేక ఆటుపోట్లు చూసినా రాజశేఖర రెడ్డి పుణ్యమాని పార్టీ గాడిలో పడింది. వరుసగా రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి.

అంతే కాదు కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిలను కూడా గెలిపించారు. రాష్ట్రం విడిపోయింది. అంతే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారన్న కోపంతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఉనికినే లేకుండా చేశారు అక్కడి ప్రజలు. తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకున్నా తెచ్చింది మాత్రం కెసిఆర్ అని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని మట్టి కరిపించారు. ఈ కారణంగా రెండు రాష్ట్రల్లోనూ కాంగ్రెస్ దెబ్బతింది.

ఇక తమిళనాడులో పార్టీ ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలను అటు జయలలిత, ఇటు కరుణానిధి అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ కూడా ఆ పార్టీ పరిస్ధితి దారుణంగా ఉంది. కర్నాటకలో భారతీయ జనతా పార్టీ నానాటికి బలపడుతోంది. ఇక్కడ అధికారంలో ఉన్న బిజెపి భవిష్యత్ లో కాంగ్రెస్ ను ఎదగనిచ్చేలా కనిపించడం లేదు.  కేరళలోనైనా నిలబడదామంటే అక్కడ వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు నూకలు చెల్లినట్లే. పాండిచ్చేరిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో నిలబడుతోంది. దక్షిణాదిపై కాంగ్రెస్ ఆశలు వదులుకుని ఉత్తరాదిలో బలపడేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేయాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -