Monday, May 20, 2024
- Advertisement -

పార్టీ పటిష్టానికి అధిష్టానం చర్యలు

- Advertisement -

తెలంగాణలో నానాటికి దిగజారుతున్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణలో లక్షన్నర మందితో దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు. పార్టీ తెలంగాణ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి వంటి సీనియర్లతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కో బూత్ నుంచి ఐదుగురు కార్యకర్తలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. సమస్యలను గుర్తించి దాని ప్రాతిపదికన కమిటీలను నియమిస్తారు. ఆ కమిటీలో గ్రామాల్లో సమస్యలపై నివేదిక తయారు చేసి దానికి అనుగుణంగా ప్రభుత్వంపై సమస్య పరిష్కారానికి ఉద్యమిస్తారు.

ఈ కమిటీలతో పాటు అయా జిల్లాలకు చెందిన అగ్ర నాయకులు క్రమం తప్పకుండా సమావేశమై పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారు. తెలంగాణ అధినాయకత్వంతో గ్రామ కమిటీలకు నేరుగా సంబంధాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -