Wednesday, May 15, 2024
- Advertisement -

సొంత బాటలో రేవంత్ రెడ్డి

- Advertisement -

ఓటుకు నోటు కేసులో నాటకీయంగా ఇరుక్కుని.. రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో.. డబ్బులు ఆఫర్ చేసిన అసలు వ్యక్తులు (?) ఈజీగా బయటపడ్డారు. విచారణ చేయిస్తున్నారు (?) కూడా కాస్త మెత్తబడ్డారు. ఇందులో అసలు వ్యవహారం ఏంటన్న విషయంపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నా.. చివరికి రేవంత్ రెడ్డికే ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయి.

రాజకీయంగా కొత్త దారి చూసుకోలేక.. ఉన్న పార్టీకి భవిష్యత్తు లేక.. కనుచూపుమేరలో మరో మార్గం కనిపించక.. ఆయన ఇన్నాళ్లూ ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇదే సందర్భంలో.. ఎవరు ఎటు వెళ్లినా.. రేవంత్ మాత్రం టీడీపీని మళ్లీ పవర్ లోకి తీసుకురాగల సామర్థ్యం తనకు ఉందని అవకాశం ఉన్నపుడల్లా చెప్పుకొచ్చారు. చివరికి.. ఇన్నాళ్లుకు ఆయనలో మార్పు వచ్చిందని కొందరంటున్నారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివాదానికి సంబంధించి.. నిర్వాసితులకు సంఘీభావంగా రేవంత్ రెడ్డి చేసిన దీక్షను.. ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ దీక్ష నిర్ణయాన్ని.. రేవంత్ ఏకపక్షంగా తీసుకున్నారని సొంత పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ గా కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు.. 2 రోజుల దీక్ష చేసిన ప్రాంగణంలో.. అధినేత బాబు ఫొటోలకు, పార్టీ రాష్ట్ర నాయకుల ఫొటోలకు అంతగా విలువ ఇవ్వలేదని చెబుతున్నారు.

చూస్తుంటే.. ఇందులో ఎంతో కొంత నిజం ఉందన్న మాట… టీడీపీ కేడర్ లో కూడా వినిపిస్తోంది. కచ్చితంగా రేవంత్ రెడ్డి సొంత కుంపటి పెట్టి.. రాజకీయంగా తెలంగాణలో సరికొత్త కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారన్న వాదన కూడా రోజురోజుకూ బలపడుతోంది. 

అందుకు.. అవకాశం వచ్చినప్పుడల్లా.. తన ఇంటెన్షన్ ను రేవంత్ ఇలా చూపించుకుంటూ ఉంటారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ విషయంపై.. బాబు ఏమనుకుంటున్నారో?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -