Wednesday, May 22, 2024
- Advertisement -

దేవస్ధానానికి అందజేసిన అన్నమయ్య భక్తులు

- Advertisement -

అన్నమయ్య. మన వాగ్గేయకారుడు. ఆయన రాసి గానం చేసిన 15 వేల కీర్తనలు ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారిక వెబ్ సైట్ లో ఈ కీర్తనలను పొందుపరిచారు అన్నమయ్య భక్తదాస సంఘం సభ్యులు.

ఏడేళ్ల పాటు కష్టపడి వీటిని రూపొందించామని, ఇదంతా యునికోడ్ లో తెలుసుకోవచ్చునని భక్తదాస సభ్యులు కల్లూరి శ్రీనివాస్, పెద్ది సాంబశివరావు తెలిపారు. టిటిడి అధికారిక వెబ్ సైట్ http://www.tirumala.org/annamacharyawebpage.aspx అనే వెబ్ పేజీలో వీటిని చూడవచ్చునని వారు తెలిపారు.

ఏడు సంవత్సరాల పాటు 70 మందితో కలిసి విశ్వవ్యాప్త అన్నమయ్య భక్తదాస సంఘంగా ఏర్పాడిన వీరు ఈ సత్కర్యం నెరవేర్చారు. దీని కోసం 29 పుస్తకాల్లోని 15 వేల సంకీర్తనల సాహిత్యాన్ని యూనికోడ్ ద్వారా ఇంటర్నెట్ లో పెట్టారు. సొంత ఖర్చుతో నిర్వహించిన ఈ మహా క్రతువును టిటిడికి ఉచితంగా అందిస్తున్నామని వారు అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -