ధ్వంసమైన తిరుమల ఘాట్ రోడ్డు..

- Advertisement -

తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడ్డాయి. తిరుపతి తిరుమల రహదారిలో కొండ చరియలు విరగడంతో రోడ్లు ధ్వంస మయయ్యాయి. అదే సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళ్తుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం, దట్టమైన పొగరావడంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. దీంతో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం ఉదయం 4 గంటల 35 నిషాలకు జరిగినట్లు అధికారులు తెలిపారు.

కొండ చరియలు విరిగి పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో టీటీడీ అధికారులు వాహనాలకు దారి మళ్లించడానికి ప్రత్యమ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. గత 30 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా తిరుమలలో వర్షాలు పడ్డాయని దీంతో ఘాట్ రోడ్ల వద్ద కొండ చరియలు విరిగిపడుతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు మరో ఆరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడనునన్నాయనని, వాటిని ముందస్తుగా తామే తొలగిస్తామని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు.

ఆలస్యంగా సీఎం టూర్ వెనక మర్మమేంటి..?

గోశాలను సందర్శించిన సీఎం జగన్

రెడ్ అలర్ట్…. ఏపీ,తమిళనాడుకి భారీ వర్ష సూచన!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -