చరణ్​- శంకర్​ మూవీపై దిల్​రాజు అప్​డేట్ ఇదే..!

- Advertisement -

జీనియస్​ డైరెక్టర్​ శంకర్​, మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ తేజ్​ కాంబినేషన్​లో భారీ బడ్జెట్ తో ఓ పాన్​ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్​ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ చిత్ర షూటింగ్​ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈ విషయంపై తాజాగా నిర్మాత దిల్​ రాజు ఓ అప్​డేట్​ ఇచ్చాడు. సెప్టెంబర్​లో ఈ సినిమా షూటింగ్​ స్టార్ట్​ అయ్యే చాన్స్​ ఉందని చెప్పుకొచ్చాడు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్​ ఎంపిక జరుగుతోంది. కొరియో గ్రాఫర్​గా జానీ మాస్టర్​, మ్యూజిక్​ డైరెక్టర్​గా తమన్​, మాటల రచయితగా బుర్రా సాయి మాధవ్​ను ఇప్పటికే ఎంపిక చేశారు.ఇక హీరోయిన్​ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. రష్మిక, పూజాహెగ్డేల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేసే చాన్స్​ ఉంది. ఇక బాలీవుడ్​ హీరోయిన్ల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. శ్రద్ధా కపూర్​ను తీసుకొనే చాన్స్​ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇంకా అధికారిక సమాచారం ఏదీ రాలేదు.

- Advertisement -

ప్రస్తుతం రామ్​ చరణ్​.. ఆర్​ఆర్​ఆర్​, ఆచార్య సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆచార్య తుది షెడ్యూల్లో చరణ్ పై డైరెక్టర్ కొరటాల శివ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే ఆర్ ఆర్ఆర్ కు సంబంధించి ఎన్టీఆర్, చరణ్ ఇద్దరికి సంబంధించి ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ జార్జియా కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. శంకర్​ అన్ని విభాగాలకు టెక్నీషియన్లు ఎంపిక చేసే పనిలో ఉన్నారని, అది పూర్తయిన అనంతరం సెప్టెంబర్​లో సినిమా షూటింగ్​ ప్రారంభమయ్యే చాన్స్​ ఉందని దిల్​ రాజు ప్రకటించాడు.

Also Read

త్వరలో ఆర్​ఆర్​ఆర్​ నుంచి ‘బీ హైండ్​ ద సీన్స్​’ .. !

వనిత నాలుగో పెళ్లి.. ఫొటోలు వైరల్​..!

రాజమౌళి – మహేష్ బాబు సినిమా కథ ఇదేనా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -