Wednesday, May 22, 2024
- Advertisement -

పేరు ఏంటొ తెలుసా…?

- Advertisement -

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పేరు సమసమాజ్. ఈ పార్టీ అధినేతగా ఆయనే కొనసాగనున్నారు. ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలోనేకాకుండా రాజకీయాల్లో సైతం పెద్ద చర్చనీయాంశంగా మారాయి.జూనియ‌ర్ ఎన్‌టీఆర్ పార్టీ పెట్ట‌డ‌మేంటి అనుకుంటున్నారా అయితే ఇది చ‌ద‌వండి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తారక్, జై పాత్రలో ఆకట్టుకున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీయార్‌ రాజకీయనాయకుడిగా కూడా కనిపించబోతున్నాడట. ‘సమసమాజ్‌’ పార్టీ నేతగా ఎన్టీయార్‌ కనిపించనున్నాడట. ఆ పాత్రకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సమసమాజ్’ పార్టీ జెండాలు, వాటి మీద ఎన్టీయార్‌ బొమ్మలు ఉన్న ఫోటలు వర్కింగ్‌ స్టిల్స్‌గా బయటకు వచ్చాయి. అయితే ఆ జెండాలపై పేరు ఇంగ్లీష్‌, హిందీ బాషల్లో ఉండడంతో.. ఎన్టీయార్‌ ఉత్తరాదికి చెందిన రాజకీయనాయకుడిగా కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -