Thursday, May 16, 2024
- Advertisement -

భారత్ ని చూసి పాకిస్తాన్ పోటీ .. అక్కడా పెద్ద నోట్ల రద్దు

- Advertisement -
Pakistan Senator Calls for Ban on Rs 1000 and Rs 5000 Currency Notes

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అనాలో లేక భారత్ ని చూసి పాకిస్తాన్ ఆదర్శం గా తీసుకుంది అనాలో గానీ భారత్ లాగా అక్కడ కూడా ఇప్పుడు నోట్ల రద్దు వ్యవహారం వచ్చేసింది. భారత్ పెద్ద నోట్ల రద్దు తరవాత వెంటనే వేనీజులా కూడా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా పాకిస్థాన్ కూడా తన దేశంలోని పెద్దనోటును రద్దుచేయాలని నిర్ణయించింది. పాక్ లో కూడా నల్లధనం బాగా పెరిగిపోయిందంట. దీంతో అవినీతిని అంతం చేయడానికి నల్లధనాన్ని పటాపంచలు చేయడానికి అని పాక్ లోని పెద్దనోటును రద్దుచేయాలని పాకిస్థాన్ సెనేట్ నిర్ణయించింది.దీంతో పాక్ లోని పెద్ద నోటయిన రూ.5 వేల నోటును రద్దు చేయాలన్న తీర్మానాన్ని పాకిస్థాన్ సెనేట్ సోమవారం ఆమోదించింది.

నల్లధనాన్ని అరికట్టడంకోసం దశలవారీగా రూ.5వేల నోట్లను ఉపసంహరించాలంటూ పాకిస్థాన్ ముస్లిం లీగ్ కు చెందిన సెనేటర్ ఉస్మాన్ సయీఫ్ ఉల్లాఖాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఎగువసభలో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. రూ. 5వేల నోటు రద్దుతో బ్యాంక్ లావాదేవీలు పెరుగుతాయని బ్లాక్ మనీ తగ్గిపోతుందని పాక్ ఎగువసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -