Friday, May 17, 2024
- Advertisement -

తిక్క కుదిరింది : భారత్ కాళ్ళు పట్టుకుంటున్న పాకిస్తాన్

- Advertisement -

యురీ దాడి ఘటన తర్వాత భారత్ చేసిన దౌత్య యుద్ధానికి పాకిస్థాన్ తలొగ్గింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేయడంతో బెంబేలెత్తిపోయింది. దీంతో కాళ్ళబేరానికి వచ్చింది. ఇదే అంశంపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. శాంతి మంత్రం వల్లించారు. ‘ఇస్లామాబాద్ శాంతిని కోరుకుంటోంది.

అయితే పాకిస్థాన్‌కు ఎవరు కీడు తలపెట్టినా వారి ఆటలు సాగనీయం’ అని నవాజ్‌ శుక్రవారం అన్నారు. జమ్మూకశ్మీర్, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పరిస్థితిని తన మంత్రివర్గ సహచరులతో సమీక్షించిన సందర్భంగా నవాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రేడియా పాకిస్థాన్ పేర్కొంది.

అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్న పాక్ శాంతిని కోరుకుంటోందని, అయితే మాతృభూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పాకిస్థానీ కంకణబద్ధులై ఉంటారని అన్నారు. దేశం యావత్తూ సైనిక బలగాలకు అండగా నిలుస్తుందన్నారు. దేశ ఆర్థిక ప్రగతి, పేదరికం, నిరుద్యోగితపై పోరాటానికి పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నట్టు నవాజ్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -