Friday, May 17, 2024
- Advertisement -

సీమాంధ్ర హక్కుల చైతన్య సభ

- Advertisement -
Pawan Kalyan’s Public Meet In Anantapur

అనంతపురం ప్రభుత్వ జూ కాలేజ్ మైదనంలో సీమాంధ్ర హక్కుల చైతన్య సభ మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్.

 సమస్య వస్తే నిలబడే వ్యక్తినే కానీ బయపడి వెనకకు వెళ్లే వ్యక్తిని కాదు అని పవన్ అన్నారు.

వీరమరణం పొందిన సైనికులకు పవన్ సంతాపం.

ప్యాకేజీలో ఇచ్చింది ఏమీలేదు మాకు రావాల్సిందే వ్వాటానే ప్యాకేజ్ రూపంలో ఇచ్చారు అని అన్నారు. అనంతపురం జిల్లా చాలా వెనకబడి ఉంది.

చట్టబద్ద ఫ్యాకేజీ ఇచ్చి వారికి వారే సన్మానం చేసుకున్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలకు ఉన్న నమ్మకంను కేంద్రం మోసం చేసింది. 

కొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతాం అని పవన్ అన్నారు. ఎవరికి భయపడి అర్ధరాత్రి ఫ్యాకేజీ ఇచ్చారు అని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్నికి అన్యాయం జరిగితే మోడికి ఎదురు వెళ్లాడానికి వెనకాడను.

మోడీ మీద గౌరవం ఉంది.. అలా అని రాష్ట్రాన్నికి అన్యాయం చేస్తే ఉరుకునేది లేదు. అలికి అన్నం పెట్టి.. ఊరికి ఉపకారం చేసినట్లుగా కేంద్రం మాట్లాడుతోంది.

ప్యాకేజ్ గురించి చదివి.. చదివి నాకు సైట్ వచ్చింది. ప్రత్యేక హోదా పై అరుణ్ జేట్లీ, వెకయ్యనాయుడు చేరో మాట చెపుతున్నారు అని పవన్ అన్నారు. 

ప్రత్యేక హోదా కేవలం విమానం కాగితం మాత్రమే. వెనకబడి జిల్లాలకు రాయితి తీసుకరావడానికి రెండేళ్లు పట్టింది ప్రభుత్వంకు. పోలవరం ప్రాజేక్ట్ కు ఇచ్చింది కేవలం 8 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఈ ప్రాజేక్ట్ పై భ్రమ కల్పిస్తోంది.

ప్రత్యేక హోదా ఇవ్వం అని స్ప్రష్టం చేయండి. కేంద్రం అన్ని రకలుగా కేంద్రం మోసం చేస్తోంది. ఎక్కడ పరిశ్రమలు పెట్టాడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో నాకు అర్ధం కావడం లేదు అని పవన్ అన్నారు.

ప్రత్యేక హోదా పై సరైన సమాదనం లేకపోతే.. 2019 ఎన్నికల్లో ఏం చేయాలో మాకు తెలుసు అని పవన్ అన్నారు. దయచేసి…మా అభిమానం.. మా ప్రేమ తో ఆడుకోకండి.. ప్రత్యేక హోదా ఏదో ఒకటి చెప్పండి.

 అనంతపురం గురించి రాయడానికి చరిత్ర… చరిత్రలు ఉన్నాయి. కానీ తాగడానికి నీళ్లు లేవు. ఏపీలో మొదలు పెట్టి జనసేన ను అనంతపురం లో నా మొదటి కార్యలయం ప్రారంభిస్తా అని పవన్ అన్నారు.

2019 ఎన్నికలో ఎమ్మేల్యేగా పోటీ చేస్తా.. మీరు నన్ను గెలిపించినా.. గెలిపించక పోయిన.. నాకు ఓటు వెసిన.. ఓటు వేయకున్న నేను మాత్రం మీకోసం పోరాడుతాను.

కరువు సమస్య తో అనంతపురం మహిళలు మానాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. నేను రైతునే.. నాకు రైతు కష్టాలు తెలుసు.  అనంతపురం.. సమగ్ర అభివృధితో కలిసి పని చేస్తాను.

నాకు సినిమాలు చేయడం వల్ల అనందం రాదు.. ఎందుకంటే నా సినిమాలు ఆడోచ్చు ఆడకపోవచ్చు. కానీ మీరు అనందంగా ఉంటానే నేను అనందంగా ఉంటా. మీ అనందం కోసం.. మీ మంచి కోసం నేను పోరాడుతాను.

అనంతపురంలో ఉన్న సమస్యలను నేను కేంద్రం వద్దకు తీసుకెళ్తా. మీ ఇంట్లోవాడిగా పని చేస్తా. అనంతపురం తాగునీటి సమస్యలు తీర్చడానికి సత్యసాయి బాబా రావాలా అని పవన్ ప్రశ్నించారు.

రాయలసీమకు నేను ఎప్పుడు అండగా ఉంటాను. జగన్, చంద్రబాబుతో నాకు ఎలాంటి గొడవలు లేవు. కానీ ఈ రాజకీయ నాయకులు ప్రజలకు అన్యాయం చేస్తే నేను ఉరుకోను. కాబట్టి ఇప్పటికైన ఈ రాజకీయ నాయకులు తప్పుదిద్దుకోవాలి.

రాజకీయాల్లోకి రావడం నాకు సరదా కాదు.. ప్రజలకు న్యాయం చేయడానికి ప్రజల పట్ల పోరడానికి నేను రాజకీయాలోకి వచ్చాను. నాకు పదవి.. రాజకీయాలు అవసరం లేదు.. కానీ ప్రజలకు న్యాయం చేయండి.

భాష సంస్కృతి లేని రాజకీయాలు నేను చేయను. టీడీపీ అన్యాయం చేస్తోంది అని జనాలు చేపుతున్నారు. రాజదాని.. రాయలసీమకు దూరంగా ఉంటుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా.. లేకపోతే మీకు శత్రువుని అవుతా.

ఏపీ సింగపూర్ కావాలంటే.. పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి.. అందమైన రోడ్లు వెస్తే.. అది సింగపూర్ కాదు. ప్రజలకు న్యాయం చేసే పనులు జరిగితే అప్పుడు అది సింగపూర్ అవుతోంది.

నేను ప్రజలకు న్యాయం చేసే పని మొదలు పెట్టాను.. అనంతపురం జిల్లా గురించి నేను కేంద్రం దగ్గర కూడా మాట్లాడాను. త్వరలో మోడీతో మాట్లాడుతాను అని పవన్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -