భారత అంతరిక్ష పరిశోధనా సంస్థఇస్రో చేపట్టిన మరో రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. పీఎస్‌ఎల్‌వీ సీ45 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా భారత రక్షణ రంగ అవసరాల కోసం రూపొందించిన ఎమిశాట్ ఉపగ్రహం సహా మరో 28 నానో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ ను ఈరోజు ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై నుంచి పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ నిప్పలు చిమ్ముకుంటూ గగన తలంలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్‌డీవో రూపొందించిన 436 కేజీల ఈఎంఐ శాటిలైట్‌ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశ పెట్టారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది. మన దేశ ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 24 ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఒక్కో శాటిలైట్‌ను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
- Advertisement -
ఇస్రో : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సి45
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
