Thursday, May 16, 2024
- Advertisement -

వ‌చ్చేనెల 11 పాక్ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న ఇమ్రాన్ ఖాన్‌…

- Advertisement -

పాక్ ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేస్తానని పాకిస్థాన్‌ తెహ్రీక్ – ఇ- ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇమ్రాన్‌ ఈ విషయాన్ని వెల్లడించినట్లు పాక్ మీడియా పేర్కొంది.

ఈ నెల 25న పాక్‌లో జురిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇమ్రాన్ ఖాన్ సార‌థ్యంలో తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసె మెజారిటీ పాక్ ప్ర‌జ‌లు ఇవ్వ‌లేదు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ 116 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఇమ్రాన్ ఖాన్ కు లభించకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతును కూడగడుతున్నారు.

ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకున్నానని ఇమ్రాన్ తెలిపారు. 48 గంటల్లోగా ఆ అభ్యర్థి పేరును తెలియజేస్తానని చెప్పారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని, పేరు వెల్లడైన తర్వాత ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారని ఇమ్రాన్ అన్నా

పీటీఐకి ఇప్పటికే జీడీఏ, ఎంక్యూఎం-పీ, అవామీ ముస్లిం లీగ్ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. దీంతో, పీటీఐ మెజార్టీ 122కు పెరిగింది. పాక్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇందులో 137 మంది సభ్యులు నేరుగా పార్లమెంట్ కు ఎన్నిక కావాలి.

ప్రజల ప్రయోజనాల మేరకే తాను ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నట్లు ఇమ్రాన్‌ తెలిపారు. సింధ్ ప్రావిన్సులో పేదరికాన్ని పారదోలడం తన ప్రాధాన్యాల్లో అతి ముఖ్యమైందని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 14) కంటే ముందుగానే అధ్యక్షుడు ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేస్తారని, తాను ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఇమ్రాన్ దీమా వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -