Thursday, April 25, 2024
- Advertisement -

మోడీని పాకిస్టాన్ లో పొగిడితే.. స్వాగతిస్తారా ?

- Advertisement -

ఇండియా పాకిస్తాన్ దేశాల మద్య వైరం ఏ స్థాయిలో ఉంటుందో యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఈ రెండు దేశాల మద్య నెలకొనే ఏ చిన్న వివాదం అయిన అది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. అయితే భారత్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ముందు వరుసలో ఉంటే పాకిస్తాన్ మాత్రం అభివృద్దికి ఆమడ దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా అసూయ, అక్కసు వెళ్లగట్టుతూనే ఉంటుంది. అయితే ఒక్క క్రికెట్ విషయంలో ఇరు దేశాల అభిమానుల మద్య రచ్చ ఎలా ఉన్న ఆటగాళ్ల మద్య మాత్రం మంచి సన్నిహిత్యం కనబడుతు ఉంటుంది.

భారత ఆటగాళ్లను పాకిస్తాన్ ప్లేయర్స్ మెచ్చుకోవడం.. వంటివి చేస్తూ ఉంటారు. కానీ రాజకీయాల విషయానికొస్తే ఇరు దేశాల నాయకులు ఒకరినొకరు ప్రశంషించుకోవడం చాలా అరుదు.. కానీ పాక్ గత ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాత్రం పలు మార్లు భారత ప్రధాని మోడీ పై ప్రశంశలు కురూపిస్తూనే ఉన్నాడు. గతంలో మోడీ పరిపాలనను మెచ్చుకున్న ఈ మాజీ ప్రధాని.. మరోసారి ఇటీవల భారత ప్రధానిపై ప్రశంశలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ద సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో పశ్చిమ దేశాలు అమెరికా కారణంగా వెనుకడుగు వేసినప్పటికి భారత్ మాత్రం అమెరికా మాటను కతారు చేయకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ప్రశంశనీయం అని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా ఈ విషయంపై భారత విదేశంగా మంత్రి గతంలో మాట్లాడినా మాటలను వీడియో క్లిప్ ప్లే చేసి మరి చూపించడం కాస్తా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే పాక్ లో రాబోయే ఎన్నికల నిమిత్తం సిద్దమౌతున్న ఇమ్రాన్.. వారి దేశానికి బద్ద శత్రువుగా ఉన్న ఇండియాపై ఈ విధంగా ప్రేమను చూపించడాన్ని ఆ దేశ ప్రజలు ఎలా స్వాగతిస్తారు ? అనే దానిపై అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇమ్రాన్ భారత్ పై కనబరుస్తున్న అభిమానం అతనికి ప్లేస్ అవుతుందో లేదా మైనస్ అవుతుందో చూడాలి.

Also Read

మోడీజీ.. విజన్ 2047 నెరవేరేనా ?

ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో మనం సాధించిందేంటి ?

ఒకప్పుడు పాక్ జండాలు ఎగిరినా చోటే.. ఇప్పుడు ఇండియా జెండాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -