Sunday, April 28, 2024
- Advertisement -

పాక్ ప్రధానికి ఇమ్రాన్‌ఖాన్ కరోనా పాజిటీవ్!‌

- Advertisement -

ప్రపంచంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ప్రపంచదేశాలతో పాటు పాకిస్తాన్‌లోనూ కోరలు చాస్తోంది. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ కు కరోనా సోకింది. ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా వైరస్ సంక్రమించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ శనివారం వెల్లడించారు. 

అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌ రావడం విస్మయం కలిగిస్తోంది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు అని సుల్తాన్‌ తెలిపారు.అయితే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజులకే ఆయనకు పాజిటివ్‌ రేపడం ఆందోళన కలిగిస్తోంది.  

చైనాకు సంబంధించిన వ్యాక్సిన్‌ ‘సినోవక్‌’ వ్యాక్సిన్‌ తొలి డోసు ఇమ్రాన్‌ఖాన్‌ తీసుకున్నారు. ఇక, పాక్‌లో ఇప్పటివరకు 6,15,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మార్చి 10న ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు.

డబ్బు లేకపోతే పోటి చేయకండి అంటూ హితబోధ..!

వంద రోజుల్లోనే వేల కొద్దీ అనుమతులు: కేటీఆర్..!

అథ్లెట్లకు కరోనా పాజిటివ్‌.. ప్రపంచకప్‌లో ముగ్గురు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -