Thursday, May 16, 2024
- Advertisement -

పాక్ ప్ర‌ధానికి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన భార‌త్….

- Advertisement -

నిత్యం విషం గ‌క్కుతూ మాట్లాడే పాక్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది భార‌త్‌. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎదురుకాల్పల్లో ఏడుగురు పౌరులు చనిపోయిన ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్య‌ల‌కు భారత్ గట్టి సమాధానం చెప్పింది. పాక్ ఉగ్రవాదాన్ని నివారించగలిగితే కశ్మీర్‌లో ఇలాంటి ఘటనలు జరగవని ఘాటుగా హెచ్చరించింది.

ఈ ఘటనపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. ‘ఎన్‌కౌంటర్‌లో సాధారణ పౌరులు చనిపోవడం బాధ కలిగించింది. ఎటువైపు ఉంటే భవిష్యత్ బాగుంటుందో కశ్మీర్ ప్రజలు ఆలోచించుకోవాలి. భారత్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావిస్తాం’ అంటూ ట్వీట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ట్వీట్‌పై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రావీశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. వారి పని వారు సక్రమంగా చేసుకుంటే మంచిదని చెప్పారు. భారత్ గురించి కాకుండా వారి దేశంలోని అంతర్గత పరిస్థితుల గురించి పట్టించుకుంటే బాగుంటుందని అన్నారు. కశ్మీర్ లో ఉగ్రదాడులకు పాకిస్థానే కారణం అనే విషయాన్ని వారు తెలుసుకోవాలని సూచించారు. సొంత దేశంలో ఉన్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా… ఇతర దేశాలను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -