Saturday, May 18, 2024
- Advertisement -

రాహుల్, జగన్ లు క్రెడిట్ సొంతం చేసుకొంటున్నారు..!

- Advertisement -

ప్రతిపక్ష పార్టీ నేతగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పై చేయిసాధించామని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మీద తాము ఒత్తిడి తీసుకు వచ్చామని.. మున్సిపల్ కార్మికుల జీతాలు పెరగడం వెనుక తమ ఒత్తిడే పని చేసింది జగన్ బ్యాచ్ అంటోంది.

మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించింది. వారికి తమ మద్దతుఉంటుందని  పేర్కొంది. చాలా చోట్ల మున్సిపల్ కార్మికులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు కూడా ధర్నాలకు దిగారు.

అలాగే మున్సిపల్ కార్మికుల జీతాలను పెంచకపోతే తాము రాష్ట్ర వ్యాప్త సమ్మెను నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ వారు ఒక ప్రకటన చేశారు. స్వయంగా జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేశాడు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా బంద్ అని జగన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. మున్సిపల్ కార్మికుల జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇలాంటి నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకుతోడు తాము కూడా ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం దిగివచ్చిందని వైకాపా నేతలు అంటున్నారు.

ఇక రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ నేతలు కూడా ఇలాగే చెప్పుకొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఇది  తమ విజయమే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాహుల్ త్వరలోనే తెలంగాణకు వస్తున్నాడు.. వర్సిటీల్లో పర్యటించబోతున్నాడు అన్న ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిందని.. నోటిఫికేషన్లను జారీ చేసింది కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ విధంగా ఏపీలో వైకాపా వాళ్లు, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లు ప్రభుత్వంపై తాము పై చేయి సాధించామని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -