దేశంలో ఆడపిల్ల పుట్టిందంటే ముఖం తిప్పుకునే వారు.. అబ్బా ఆడిపల్లా అంటూ నిష్టూరంగా మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారు. మగ పిల్లాడు పుడితే సంబురాలు చేసుకుంటూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించే వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఆడపిల్ల ఇంటికి మహాలక్షి అంటారు.. అలా అని ఎంతో గౌరవంగా చూసుకునేవారు కూడా ఉన్నారు. ఈ మద్య ఆడపిల్ల మగపిల్లాడు అనే తారతమ్యలు లేకుండా పోతున్నాయి.
తాజాగా తమకు ఆడపిల్ల పుట్టిందని సంబరాలు మామూలుగా చేసుకోలేదు.. ఏకంగా హెలికాప్టర్ లో తమ ఇంటి మహాలక్ష్మిని తీసుకు ఊళ్లోకి తీసుకు వచ్చారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తమ కుటుంబంలో పుట్టిన మొదటి ఆడబిడ్డకు బ్యాండ్ బాజాలతో ఘన ఘనంగా స్వాగతం పలికింది. రాజస్థాన్‌లోని నౌగౌర్ జిల్లా నింబిడి చందావాతాకు చెందిన హనుమాన్ ప్రజాపత్, చుకీదేవి దంపతులకు గత నెలలో ఆడ శిశువు జన్మించింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం ఆనంతరం చుకీదేవి తన పుట్టింటికి వెళ్లింది. విచిత్రం ఏంటంటే.. ప్రజాపత్ తండ్రి మదన్‌లాల్ కుటుంబంలో 35 ఏళ్లుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు.. లేక లేక ఇన్ని సంవత్సరాల తర్వాత తమ ఇంట ఆడపిల్ల పుట్టిందని తెలియడంతో అప్పటి నుంచి వారి ఇంట సంతోషాలు వెల్లువెత్తాయి. ఇన్నేళ్లకు పుట్టిన ఆడపిల్లను మామూలుగా కాకుండా.. అందరూ చెప్పుకునేలా ఇంటికి తీసుకురావాలని భావించాడు ఆ పాప తాత మదన్ లాల్.
ఇందుకోసం కోడలు, మనవరాలిని తీసుకొచ్చేందుకు రూ. 4.5లక్షలు పెట్టి ఏకంగా ఒక హెలికాప్టర్‌నే బుక్ చేశాడు. జిల్లా అధికారులతో మాట్లాడి తన కోడలి గ్రామంలో, తమ స్వగ్రామంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయించుకున్నాడు. కోడలి ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్లిన మదన్‌లాల్.. అక్కడ పాప పేరు మీద ప్రత్యేక పూజలు చేసి తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. మొత్తానికి ఒక ఉత్సవంలో ఇంటికి తీసుకెళ్లారు.
జస్టిస్ రమణకు సెలబ్రెటీల అభినందనలు..
కాంగ్రెస్ ఎంఎల్ఎ కళావతి కరోనాతో మృతి
వైద్య, ఆరోగ్యశాఖకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు!