Saturday, May 18, 2024
- Advertisement -

చెన్నై కి ట్రక్కు మందులు పంపిస్తే నిమిషాల్లో ఖాళీ అయిపోతున్నాయి – రానా

- Advertisement -

వరదల్లో చనిపోయిన తమవారి శవాలని ఇంట్లో పెట్టుకుని ఎలా దహన సంస్కారాలు చెయ్యలో కూడా తెలియని పరిస్థితి కి చేరుకున్నారు చెన్నై జనాలు. వరదలు ముంచెత్తి వారిని అంత అస్తవ్యస్తం చేసేసాయి. ఎన్నో మూగ ప్రాణులు సైతం చనిపోయాయి. అక్కడి నీటిలో వాటి శవాలు తేలుతూ కనిపిస్తున్నాయి. ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా వరదల వేల జెట్ స్పీడ్ తో అంటు రోగాలు ప్రబలిపోతాయి.

చెన్నయి కి మెడిసిన్ రూపేణా సాయం కూడా చాలా అత్యవసరం గా ఉంది. అక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా కూడా ఉంది. మన తెలుగు హీరోలు ఇక్కడ నుంచి ఇది గ్రహించి వారికి మందులు పంపిస్తున్నారు చెన్నై వీధుల్లో మనవారు నలుగురు టీం గా మారి నిరంతరాయంగా పనిచేస్తున్నారు . సరిహద్దులు దాటి చెన్నయ్ నగరంలోకి ట్రక్కులతో మెడిసిన్ తెప్పిస్తున్నారు. ప్రజలకు నేరుగా వాటిని అందేలా చేస్తున్నారు. 

రానా అండ్ టీమ్ – సిద్ధార్థ్ అండ్ టీమ్ – ధనుష్ అండ్ టీమ్ – విశాల్ అండ్ టీమ్ .. ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ విషయంలో హీరో రానా రామానాయుడు స్టూడియో నుంచి చెన్నై కి ట్రక్కు మెడిసిన్ లు పంపించారు కేవలం రెండు మూడు నిమిషాల్లో ఒక ట్రక్కు మేడిసన్ లు ఖాళీ అయిపోయాయి అంటే అక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -