Sunday, May 19, 2024
- Advertisement -

శ్రీశైలం జ‌లాశ‌యానికి పోటెత్తిన వ‌ర‌ద‌…నాలుగు గేట్లు ఎత్తి నీటివిడుద‌ల‌

- Advertisement -

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ వరద నీటితో జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు నాలుగు గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో 3,36,503 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 1,03,792 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది.

సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి ఒక లక్ష 87 వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ ప్రస్తుత నీటిమట్టం 530.10గా ఉంది. ప్రాజెక్టులోకి 74వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 8438గా కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 180.28 టీఎంసీలకు చేరింది. ఈ వరద ఇలాగే కొనసాగితే మరికొద్ది గంటల్లో ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. ప్రాజెక్టు గేట్లెత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -