Sunday, May 19, 2024
- Advertisement -

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత….

- Advertisement -

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద నీరు పెరుగుతుండంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని నాగార్జునా సాగర్ కు విడుదల చేశారు.

కృష్ణా నది, దాని ఉపనదులకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, జూరాల జలాశయాలు నిండటంతో.. శ్రీశైలం డ్యామ్‌కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 1.06 లక్షల క్కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ముందుగా మంత్రి అనిల్ కృష్ణానదికి ప్రత్యేక పూజలు చేశారు.

దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్‌వైపు పరుగులు పెడుతోంది. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలుత 6వ నెంబర్‌ గేటను ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 25వేల క్యూసెక్కుల చొప్పున అధికారులు నీటిని విడుదల చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -