Thursday, May 16, 2024
- Advertisement -

ఆకాశంలో ఒకేసారి మూడు అద్భుతాలు…

- Advertisement -

సుమారు 36 ఏళ్ల తర్వాత ఆకాశంలో చంద్రుని సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. సూపర్‌ మూన్, బ్లూ మూన్, సంపూర్ణ చంద్ర గ్రహణం మూడు కలసి ఒకసారి కనిపించి ప్రపంచంలోని పలు దేశాల ప్రజలను కనువిందు చేశాయి. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోవడంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో(బ్లడ్‌ మూన్‌గా) కనిపించింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అద్భుతం ఎట్టకేలకు ఆకాశంలో ఆవిష్కృతమైంది. దాదాపు 152 ఏళ్ల తర్వాత ఏర్పడిన ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు అంతా ఆసక్తి చూపారు. మళ్లీ ఇలాంటి చంద్ర గ్రహణాన్ని చూడాలంటే 2037 వరకు వేచి చూడాల్సిందే. సాధారణంగా పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. దీంతో ఎప్పుడూ కనిపించే పరిమాణం కంటే 14 శాతం పెద్దదిగా, 50 శాతం కాంతివంతగా చంద్రుడు కనిపిస్తాడు.

ఇదే సమయంలో చంద్ర గ్రహణం కూడా ఏర్పడిన నేపనథ్యంలో గ్రహణాన్ని అత్యంత సమీపంలో వీక్షించే అవకాశం కలిగింది. ఇక మూడో ప్రత్యేకత అన్నింటికంటే అరుదైనది. నిత్యం తెల్లని వర్ణంలో వెన్నెల కురిపించే చంద్రుడు రెండు భిన్నమైన రంగుల్లో దర్శనమివ్వడం. భూమి అడ్డం రావడం వల్ల చంద్రుడిపై పూర్తిగా సూర్యుడి కాంతి పడదు.

దీనివల్ల సన్నని కిరణాలు చంద్రుడిని తాకి రెండు భిన్నమైన రంగుల్లో కనిపిస్తుంది. అయితే, బ్లూ మూన్ కంటే.. బ్లడ్ మూన్‌గానే ఎక్కువగా కనిపిస్తాడు. మళ్లీ ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడాలంటే 2037 వరకు ఆగాల్సిందే.

సాయంత్రం 04.21 గంటలకు ప్రారంభమైన గ్రహణం రాత్రి 7.37 గంటల వరకూ కొనసాగనుంది. ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటు చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -