Wednesday, May 15, 2024
- Advertisement -

దమ్ముంటే రండి .. తలసాని సవాల్

- Advertisement -
talasani open challange to opposition on ghmc

సుదీర్గ కాలం పాటు మీడియా కి దూరంగా ఉన్నారు తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యదవ్. ప్రతిపక్షాల మీద ఒక్క మాట కూడా ఈ మధ్యకాలం లో మాట్లాడని ఆయన ఇప్పుడు సడన్ గా మీడియా ముందరకి వచ్చి ఆసక్తికర సవాల్ విసిరారు.

రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో విపక్ష నేతలు మతిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల కోసమన మరవరాదని ఆ క్రమంలో పనిచేసుకుంటూ పోతున్న సర్కారుపై విమర్శలు మంచిది కాదని తలసాని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్మించిన కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వ ఆస్తే తప్పించి వ్యక్తిగతం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్వామీజీలను పిలవడంలో తప్పులేదన్నారు.

దోచేసిన దొంగలా తమ గురించి మాట్లాడేది అని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. పోటుగాళ్లైతే రండి.. అసెంబ్లీలో తేల్చుకుందామని మీరేం చేశారో.. మేమేం చేశామే తేలుతుందని మంత్రి సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీలో వందకోట్ల అవినీతి అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తలసాని దుయ్యబట్టారు. అవినీతి ఎక్కడ జరిగిందో చూపించాలని మంత్రి సవాలు విసిరారు. ఊ అంటే ఈ అంటే అవినీతి అక్రమాలు మాటలు తప్పితే ప్రజా సంక్షేమం పట్టదని ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -