Monday, May 20, 2024
- Advertisement -

ఆ సీటులో ఎదురీదుతున్న కూటమి అభ్యర్థి?

- Advertisement -

బెజవాడ పాలిటిక్స్ ఎప్పటికి ప్రత్యేకమే. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ సీటు కోసం టీడీపీ – జనసేన తీవ్రంగా పోటీ పడగా చివరకు కూటమి తరపున బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. అయితే ఇక్కడ నుండి బీజేపీ పోటీ చేస్తున్న మైనార్టీ ఓట్లు అధికంగా ఉండటంతో సుజనా గెలుపుపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎందుకంటే విజయవాడ పశ్చిమలో మైనార్టీ ఓట్లు అధికం. సంప్రదాయంగా ముస్లిం, క్రైస్తవ ఓటర్లు వైసీపీకి ఓటు బ్యాంకు. అందుకే జగన్ ఇక్కడి నుండి మైనార్టీ అభ్యర్థి షేక్ ఆసీఫ్‌ను బరిలో దింపి గెలుపు సంకేతాలను ఇచ్చారు జగన్.

ఇక ప్రచారంలో తనదైన శైలీలో దూసుకుపోతున్నారు ఆసీఫ్. తన వర్గానికి చెందిన ఓటర్లతో పాటు ఇతర వర్గాల వారిని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా జగన్ చేపట్టిన సంక్షేమాన్ని వివరిస్తు ఓట్లు అడుగుతున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి ఆర్ధికంగా బలవంతుడు ఇదొక్కటే బలం తప్ప టీడీపీ, జనసేన నుండి మద్దతు అంతంతమాత్రమేనని టాక్ నడుస్తోంది.

ఈ స్థానం నుండి గతంలో పలువురు ముస్లిం అభ్యర్థులు విజయం సాధించడం, బీజేపీ అభ్యర్థి పోటీలో ఉండటంతో ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉండనుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -