Monday, April 29, 2024
- Advertisement -

బెజవాడ టీడీపీ..వార్‌కు చెక్ పడేనా?

- Advertisement -

విజయవాడ టీడీపీలో వార్ ఆగడం లేదు. చంద్రబాబు ఒంటెద్దు పొకడతో టీడీపీకి దూరమయ్యారు సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని. రెండుసార్లు విజయవాడ నుండి గెలిచిన నాని…ఈసారి వైసీపీ తరపున తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇక నాని టీడీపీకి రాజీనామా చేయడంతో ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి సీటు కన్ఫామ్ అని అంతా అనుకున్నారు.

అయితే తాజాగా చిన్నికి మరో సీనియర్ నేత రూపంలో చెక్ పడేలా కనిపిస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు,మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి టీడీపీ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా…సీటు విషయంలో చంద్రబాబబు నుండి స్పష్టమైన హామీ రాగానే టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ టీడీపీ నుండి సాధ్యం కాకపోతే పొత్తులో భాగంగా బీజేపీ నుండి బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారట సుజనా. దీంతో చిన్నికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడిందని స్థానిక నేతలు చెబుతున్నారు. వాస్తవానికి అన్న నానితో విభేదించి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు చిన్ని. ఇక చంద్రబాబు సైతం నానిని కాదని చిన్నిని ప్రోత్సహించగా తాజాగా మరోపేరు తెరపైకి రావడం చిన్ని వర్గీయులను కలవర పెడుతోంది. దీనికి తోడు చంద్రబాబు నుండి చిన్నికి స్పష్టమైన హామీ లభించక పోవడంతో టెన్షన్‌కు గురవుతున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో మార్పులు జరిగితే ఈ సారి కుడా చిన్నికి భంగపాటు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి విజయవాడ సీటు ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -