Sunday, May 19, 2024
- Advertisement -

అన్నీ తానే అయ్యి, అందరికీ ఛాన్స్ ఇస్తూ జగన్

- Advertisement -

ఏపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్ మోహన్ రెడ్డి నిన్న మొత్తం ఒక్కరే మాట్లాడారు. ఏపీ అధికార పక్షం ఆరు పదుల సంఖ్యలో మాట్లాడితే విపక్షం తరఫున జగన్ ఒక్కరే మాట్లాడ్డం విశేషం. ఈ సందర్భంగా ఏపీ అధికార పక్షం జగన్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తమ సొంత పార్టీ వారికి సైతం జగన్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు అని వారు ఆరోపిస్తున్నారు.

అయితే చర్చ తాను అనుకున్న విధంగా సాగాలి అనే లాజిక్ తో జగన్ ఆయనే సర్వం అయ్యి మాట్లాడుతున్నారు. మిగితా నేతలు మాట్లాడే క్రమంలో ఏదైనా తప్పులు దోర్లినట్టు అయితే లేనిపోని ఇబ్బందులు ఒస్తాయి కాబట్టి జగన్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు ఈ విషయాన్ని. జగన్ ని అనుకూలంగా వాదిస్తున్నవారు సోమవారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏపీ అసంబ్లీ లో ఒంటరిగా పోరాటం చేసారు అనీ అంటున్నారు.

అయితే ఇవాళ దానికి విభిన్నంగా జగన్ మిగితా సభ్యులతో కూడా మాట్లాదిస్తునారు. మిగితా వారి మీద నమ్మకం లేక జగన్ తానే అన్నీ అయ్యి మాట్లాడుతున్నారు అనే ఉద్దేశ్యం పోవడం కోసం అన్నట్టు జగన్ ఇవాళ ఇంకొందరికి మైక్ ఇచ్చారు. పైగా జగన్ అన్నేసి గంటలు మాట్లాడీ మాట్లాడీ నిన్న చాలా ఇబ్బంది కూడా పడ్డారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -