Saturday, May 18, 2024
- Advertisement -

మహారాష్ట్రలో తెలుగు వారి పరువు తీసిన టిడిపి ఎమ్మెల్యే…. కుంభకోణంలో అరెస్ట్?

- Advertisement -

రాష్ట్ర విభజన పుణ్యమాని సర్వం కోల్పోయిన సీమాంధ్రులు ఆవేధనలో ఉంటే చంద్రబాబు మాత్రం ఎంచక్కా తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించేసుకుని తనను తాను జాతీయ అధ్యక్షుడిగా నియమించుకుని, టిడిపిని శాఖలుగా విభజించి ఇకపైన టిడిపి దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతుందని గొప్పగా డప్పు కొట్టుకున్నాడు. ఇక ఎల్లో మీడియా మొత్తం కూడా టిడిపి జాతీయ పార్టీ అయిపోయినట్టుగానే ప్రచారం హోరెత్తించాయి. ఆ విషయాన్ని ఈ రోజుకీ ఎలక్షన్ కమిషన్ ధృవీకరించింది లేదు. జాతీయ పార్టీగా గుర్తింపుకు నోచుకోవడానికి అవసరమైన సీట్లు టిడిపికి లేవన్నది నిజం. ఇక విభజన తర్వాత అధికారంలోకి వస్తాం, చంద్రబాబు లేఖల వళ్ళే తెలంగాణా వచ్చింది, విభజన బిల్లుకు అనుకూలంగా మొదటి ఓటు వేసింది మేమే అని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలందరూ తెలంగాణా ఘనంగా ప్రచారం చేసుకున్నారు కానీ అధికారం దక్కలేదు. ఓటుకు కోట్లు తర్వాత కేసీఆర్ దెబ్బకు మొత్తం బిచాణా ఎత్తేయాల్సి వచ్చింది.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఒక టిడిపి ఎమ్మెల్యే మాత్రం చంద్రబాబు ఆశ నెరవేర్చాడు. జాతీయ స్థాయిలో ఒక స్కామ్‌కి పాల్పడి దేశవ్యాప్తంగా టిడిపి పేరు వినిపించేలా చేశాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని చూస్తోంది. అరెస్ట్ చేశారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టిడిపి ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు మహారాష్ట్రలో ఉన్న విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి కాంట్రాక్ట్ పనులు చేజిక్కుంచుకున్నాడు. అయితే అవినీతి వ్యవహారాలతో అంచనాలను పెంచి ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో నష్టం చేశాడు. కోట్లాది రూపాయల ఆ కుంభకోణం బయటపడడంతో ఆ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ దాఖలవ్వడంతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం హల్చల్ చేస్తోంది. అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది చంద్రబాబు కూడా కేంద్రంలో భాగస్వామిగా ఉన్న ఎన్డీయేనే అన్న విషయం తెలిసిందే.

నాలుగు ఎఫ్ ఐఆర్‌లు నమోదైన ఈ కేసులో ప్రధాన నిందుతుడైన టిడిపి ఎమ్మెల్యే మాత్రం కనిపించకుండా తిరుగుతున్నాడు. మరోవైపు అరెస్ట్ అయ్యాడన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య పోలవరం అంచనాలు పెంచడం, కేంద్రం అడ్డుపుల్ల వేసిన ఇష్యూలో కూడా ఢిల్లీ టూర్ వేసిన టిడిపి బృందంలో ఈయన కూడా ప్రధాన సభ్యుడే. ఆ తర్వాత నుంచీ ఈ టిడిపి ఎమ్మెల్యే కనిపించడం లేదు. జాతీయ మీడియాలో మాత్రం టిడిపి ఎమ్మెల్యే కుంభకోణం ఘనత ఓ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. మన ఎల్లో మీడియాకు ఇలాంటి విషయాలకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వదనుకోండి. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యే స్థాయి కుంభకోణానానికి పాల్పడి జాతీయ స్థాయిలో టిడిపి పేరు మారుమోగేలా చేసిన సదరు టిడిపి ఎమ్మెల్యే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సన్మాన కార్యక్రమం గట్రా ఏమైనా ఏర్పాటు చేస్తాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -