Monday, May 20, 2024
- Advertisement -

విపక్ష సభ్యుడు స్పీచ్ కి ఫ్లాట్ అయిన చంద్రబాబు

- Advertisement -

విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే అధికార పక్షం దాన్ని తిప్పి తిప్పి కొట్టడం రాజకీయాలలో తెల్లారితే జరిగేదే కానీ విపక్షం లో కూడా కొందరు సరైన నాయకులు ఉంటారు అనీ వారికి కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తే పాలన బాగుంటుంది అనే పెద్ద మనసు ఎవరికీ ఉండదు. అలాంటి అరుదైన సంచలనానికి దారి తీసారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విపక్షానికి చెందిన ఒక నాయకుడికి అధికార పక్షం పదవి ఇవ్వడం అంటే మాటలా? పార్టీ మారాలి అనే ప్రయోజనం కూడా లేకుండా అసంబ్లీ లాబీలో ఇది జరిగింది. ఇలాంటి ఆసక్తికర నిర్ణయం చంద్రబాబు తీసుకోవడం వెనక పెద్ద చర్చే సాగుతోంది విపక్షానికి చెందిన ఎమ్మెల్సీ సూర్యారావు పీడీఎప్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన కామన్వెల్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు.. సూర్యారావు మాట్లాడారు. ఆయన ప్రసంగం భారీగా సాగింది. ఎన్నికల ముందర విభేదాలు ఉన్నా ఎన్నికల తరవాత అందరూ కలిసి ఉండాలి అనే నైజం గాంధీ గారు నేర్పించారు అని మర్చిపోవద్దు అని ఆయన చెప్పడం చంద్రబాబు కి బాగా హత్తుకుంది అంటున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. ఇన్ని కష్టాల మధ్య చంద్రబాబు ఎలా పాలన చేస్తున్నారో అర్థం కావటం లేదంటూ సూర్యారావు వ్యాఖ్యానించారు. పెళ్లిళ్లు.. తిరుపతి హుండీలకు.. చర్చిలకు కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్న వారు.. ఆ డబ్బుతో పేదల ఆరోగ్యానికి కానీ.. సంక్షేమానికి కానీ ఖర్చు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వినడమే కాక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని జిల్లా కేంద్ర ఆసుపత్రి సలహా మండలి చైర్మన్ గా ఆయన్ని ప్రకటిస్తూ  నిర్ణయం తీసుకున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -