Friday, March 29, 2024
- Advertisement -

కండీషన్లతో ఇంటికి చేరిన పుట్ట మధు..!

- Advertisement -

పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్టా మధును పోలీసులు మూడు రోజులపాటు విచారించారు. పుట్ట మధు హైకోర్టు న్యాయవాదులైన వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మూడు రోజుల విచారణ తరువాత నిన్న అర్ధరాత్రి ఆయనను ఇంటికి పంపించారు. తిరిగి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు పుట్టా మధుకు సూచించారు.

ఆయనతో పాటు ఆయన భార్య శైలజ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వూదరి సత్యనారాయణను కూడా విచారణలో భాగంగా ప్రశ్నించారు. విచారణ పూర్తి కావడంతో పుట్టా మధును పోలీసులు నిన్న అర్ధరాత్రి ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన బ్యాంకు ఖాతాలు, బంధుమిత్రుల ఆస్తి విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.

అయితే వామన్ రావు దంపతులకు హత్య జరగడానికి ముందు బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన రూ. 2 కోట్ల ఎవరెవరి చేతులు మారాయనే విషయంపై దృష్టి సారించారు. మరోవైపు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు పుట్టా మధుకు సూచించారు.

పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న పూజా హెగ్డే.. ఏ విషయంలో అంటే?

పోల‌వ‌రం పురోగ‌తి: ఐదేళ్ల గ్రాఫిక్స్‌ను రెండేళ్ల‌లో నిజం చేసిన జ‌గ‌న్‌

తిరుపతిలో విషాదం.. ఆక్సిజన్ అందక రుయాలో 11 మంది మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -