Saturday, May 18, 2024
- Advertisement -

రెండు, మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం

- Advertisement -

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోవాలంటే ఓ రెండు, మూడు రోజులు కేటాయించాల్సిందే. తిరుమ‌లకు వెళ్లాలంటే ఓ మూడు రోజులు కేటాయించాల్సిన ప‌రిస్థితి. తిరుమ‌లకు చేరుకుంటే ఏ దానికైనా గంట‌ల కొద్దీ వేచి ఉండాల్సిందే. ద‌ర్శ‌నం కోసమైతే గంట‌ల కొద్దీ క్యూలో నిల్చొని ఉండాల్సిన ప‌రిస్థితులు ఇప్పుడు తీర‌నున్నాయి. కేవ‌లం రెండు, మూడు గంట‌ల్లో ఆ ఏడుకొండ‌ల వాడిని మ‌నం చూసుకోవ‌చ్చు. శ్రీవారి ద‌ర్శ‌నం కేవ‌లం త్వ‌ర‌గా జ‌రిగే ప‌రిస్థితి దేవ‌స్థానం పాల‌క క‌మిటీ చ‌ర్య‌లు తీసుకుంది.

శ్రీవారి సర్వ దర్శనానికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాములు (టీటీడీ) ప్రయోగాత్మకంగా టైమ్‌ స్లాట్‌ విధానం ప్రారంభించింది. ఈ ప్ర‌యోగం విజయవంతమైంది. తొలిరోజు సోమవారం 12 వేల టోకెన్లు మంజూరు చేశారు. సీఆర్వో వద్ద ఏర్పాటు చేసిన టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ కౌంటర్లకు అర్చకులు పూజలు చేసిన అనంతరం ఉదయం 6 గంటలకు ఆల‌య‌ జేఈఓ శ్రీనివాసరాజు ప్రారంభించారు.

తొలిస్లాట్‌కు ఉదయం 11గంటలకు దర్శన సమయం కేటాయించారు. నిర్దేశిత సమయాల్లో దివ్య దర్శన కాంప్లెక్సుకు చేరుకున్న భక్తుల టోకెన్లను సిబ్బంది పరిశీలించి రాయితీపై రూ.25 చొప్పున రెండు లడ్డూలు అందించారు. ఆ తర్వాత క్యూలైన్‌లోకి వెళ్లిన భక్తులు 2 గంటల్లోపే స్వామిని దర్శించుకున్నారు. ఈ విధంగా త్వ‌ర‌గా ద‌ర్శ‌నం కావ‌డంతో భ‌క్తులు చాలా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ద‌ర్శ‌నం కావ‌డంతో భ‌క్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

టీటీడీ ఈఓ ఏకే సింఘాల్‌, జేఈఓలు శ్రీనివాసరాజు, భాస్కర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌డుతున్నారు. టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీతో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు భక్తుల రాక తగ్గుముఖం పట్టింది. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు స్లాట్‌కు 1,500 చొప్పున నిర్దేశిత సమయాన్ని కేటాయించారు.

తిరుమ‌ల‌లో టోకెన్ల జారీ కేంద్రాలు ఇవే..
కేంద్రీయ విచారణ కార్యాలయం, సప్తగిరి సత్రాలు, కౌస్తుభం, సన్నిధానం, ఆర్టీసీ బస్టాండ్‌, పద్మావతి నగర్‌ సర్కిల్‌, ఎంబీసీ-26, ఏటీసీ, వరాహస్వామి, నందకం విశ్రాంతి సముదాయాలు, కల్యాణవేదిక, గాలిగోపురం, శ్రీవారి మెట్టు మార్గాల్లో కలిపి మొత్తం 117 టైమ్‌స్లాట్‌ టోకెన్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -