నేడు రైతుల ఆధ్వర్యంలో భారత్ బంద్ కొనసాగుతోంది. సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతులు గత వంద రోజులుగా నిరసనలు చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తామన్నారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్‌బీర్ సింగ్ చెప్పారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు.

అయితే అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. కాగా, నేడు రెండోసారి భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో ఎక్కడి రవాణా అక్కడే ఆగిపోయింది. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ మూతపడ్డాయి.

ఇక ఈ బంద్ కు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ తదితర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. సాగు చట్టాలను కేంద్రం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఇప్పటికే రైతులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో భారత్ బంద్ కొనసాగుతోంది. బీజేపీ, జనసేన పార్టీలు మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ఇవ్వడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోవడంతో ప్రజా రవాణా స్తంభించి పోయింది.
ముంబాయిలో మరో విషాదం.. కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం!