Thursday, April 25, 2024
- Advertisement -

తిరుపతి ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ !

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే స్థానిక ఎన్నికలు ముగిశాయి. మళ్లీ మరో పోరు మొదలు కానుంది. అదే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. ఇప్పటికే రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ నువ్వా నేనా అనే విధంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ రేసులో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీలు కాస్తా ముందంజ‌లో ఉన్నాయ‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఈ రెండు పార్టీలు తిరుప‌తి ఎంపీ బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌కటించాయి.

అయితే, తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానంపై బీజేపీ భారీ స్థాయిలో క‌స‌ర్తులు చేస్తోంది. ఇక్క‌డ బ‌రిలో నిలిపే అభ్య‌ర్థిపై అన్ని కోణాల్లోనూ విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపింది. ఇక తాజాగా బ‌రిలో నిల‌ప‌డానికి మాజీ ఐఏఎస్ అధికారిణి ర‌త్న‌ప్ర‌భ పేరును ఖ‌రారు చేశారు. దీనిని త్వ‌ర‌లోనే రాష్ట్ర క‌మ‌లం అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా, 1981 క్యాడర్ చెందిన ఐఏఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన చెందిన‌వారు. ఆమె చివ‌ర‌గా క‌ర్నాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించి రిటైర్ అయ్యారు. ప‌దవీ విరమణ అనంత‌రం ఆమె రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి.. బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. కాగా, తిరుపతి ఉప ఎన్నిక వ‌చ్చే నెల 17న జరగనుంది.

రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. నిమ్మకాయ జ్యూస్‌

బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ !

ముగ్గురు భామ‌ల‌తో ర‌వితేజ రొమాన్స్

లిప్‌లాక్ తో మ‌త్తెక్కిస్తున్న పూజిత పొన్నాడ‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -