Thursday, May 16, 2024
- Advertisement -

ముంబాయిలో మరో విషాదం.. కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం!

- Advertisement -

దేశంలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలే కరోనా మహమ్మారితో నానా అవస్థలు పడుతుంటే.. ఈ మద్య ఆసుపత్రుల్లో అగ్ని రూపంలో మృత్యువు బాధితులను కబలిస్తుంది. తాజాగా ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు కరోనా రోగులు సజీవదహనమయ్యారు. 

భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్‌లో ఉన్న సన్‌రైజ్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.  సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అక్కడ ఉన్న దాదాపు 70 మంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు.

మాల్‌లోని మొదటి అంతస్తులో అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించిందని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ మాట్లాడుతూ.. ఇది చాలా విషాద సంఘటన అని.. ఏడుగురు రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, 70 మందిని మరో ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు.

మహిళలకు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధర!

తిరుపతి ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ !

రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -