Saturday, April 27, 2024
- Advertisement -

మహిళలకు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధర!

- Advertisement -

దేశంలో మహిళలు ఎంతగానో ఇష్టపడే బంగారం ధర గత కొంత కాలంగా చుక్కలనంటుతున్న విషయం తెలిసిందే. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే. పసిడి ధర ఎప్పుడు పెరుగుతుందో? ఎప్పుడు పడిపోతుందో అస్సలు అర్ధం కాదు. గత మూడు రోజులుగా తగ్గిన పసిడి ధర.. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం రేటు స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 పైకి పెరిగి రూ. 45,820 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 42,000 కు చేరింది.  విజయవాడ-రూ. 45,820 ముంబై-రూ. 44,920, చెన్నై-రూ. 46,200, న్యూఢిల్లీ-రూ. 48,160, బెంగళూరు-రూ. 45,820, కోల్‌కతా-రూ. 47,040 బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి.

తాజాగా 1 కిలో వెండి ధర రూ. 300 తగ్గి రూ. 69,400 కు చేరుకుంది. నేటి వెండి ధరలు హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,400గా ఉంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ. 300 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.694గా ఉంది.

తిరుపతి ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ !

రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

‘101 జిల్లాల అందగాడు’ గా వస్తున్న శ్రీనివాస్ అవసరాల!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -