Wednesday, May 22, 2024
- Advertisement -

వావ్‌.. వైద్య చ‌రిత్ర‌లోనే మిరాకిల్‌.. పురుడు పోసుకున్న ట్రాన్స్‌జెండ‌ర్‌

- Advertisement -

వైద్య చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ చూడ‌ని వింత‌.. వావ్ వాటే మిరాకిల్ అని ఏదో సినిమాలో కామెడీ స‌న్నివేశం గుర్తుస్తోంది క‌దా! కానీ అలాంటి మాట నిజంగానే అనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. హార్మోన్ల చికిత్స ద్వారా పురుషుడిగా మారిన మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. ఈ ఘ‌ట‌న ఫిన్లాండ్ దేశంలో చోటుచేసుకుంది. ఆ వివ‌రాలు ఏమిటో.. ఎలానో చ‌ద‌వండి.

ఫిన్లాండ్‌కు చెందిన‌ ప్రస్తుతం 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి 2015లో టెస్టోస్టెరాన్‌ థెరపీ ద్వారా మహిళ నుంచి పురుషుడిగా మారాడు. అతడు గర్భం దాల్చడానికి ముందే లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉన్నా దాన్ని వద్దనుకున్నాడు. ఫిన్లాండ్‌ చట్టం ప్రకారం హార్మోనల్‌ థెరపీ ద్వారా మహిళ నుంచి పురుషుడిగా మారాలనుకునే వ్యక్తి తాను పునరుత్పత్తి చేయలేని స్థితిలో ఉన్నట్టు నిరూపించుకోవాలి. ఆ విధంగా నిరూపించుకొని మొత్తానికి గ‌ర్భం దాల్చాడు. చివ‌రికి రెండు వారాల కింద‌ట బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాడు. అయితే అతడి కుటుంబ గోప్యతను దృష్టిలో పెట్టుకొని అతడి వివ‌రాలు మీడియాకు వెల్లడించలేదు.

పుట్టిన బిడ్డ 4 కిలోల‌ బరువు, 53 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఇందులో ఆశ్చ‌ర్య‌మేమంటే బిడ్డకు జన్మనిచ్చిన అతడికి పితృత్వపు (మెట‌ర్నిటీ) సెలవులు కూడా మంజూరు చేశారు.

ఇప్పుడు మీరు అనండి వావ్ వాటే మిరాకిల్‌.. అని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -