Sunday, May 19, 2024
- Advertisement -

టీఆర్ఎస్ తో ఆ పార్టీ దోస్తీ.. ప్రతిపక్షాలకు ఇది లాభమా?!

- Advertisement -

అనధికార సమాచారాన్ని బట్టి చూస్తే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్ పార్టీలు చేతులు కలపడం ఖాయమని తెలుస్తోంది.

కోర్టు నుంచి వరసగా మొట్టికాయలు పడుతున్న తరుణంలో ఆ ఎన్నికలను నిర్వహించక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆ ఎన్నికలను ఎదుర్కొనడానికి కూడా ప్రిపేరవుతుంది. ఈ ప్రిపరేషన్ లో భాగంగాఇప్పటికే చాలా మంది తెలుగుదేశం  ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకొంది.

అయితే వారి సాయంతోనే గెలిచేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితికి నమ్మకం కుదిరినట్టుగా లేదు. అందుకే మరో యత్నంగా మజ్లిస్ తో చేతులు కలపడానికే తెరాస రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ మజ్లిస్ తో తెరాసకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. తాజాగా తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ..  మజ్లిస్ తమకు ఫ్రెండ్లీ పార్టీ అని స్పష్టం చేశాడు.

తద్వారా తమ బంధాన్ని తెలియజేశాడు నాయిని. మరి ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి గనుక మజ్లిస్ తో చేతులు కలపడం ఖాయం అయితే.. అది టీఆర్ఎస్ కు ప్లస్ కావడం ఎలా ఉన్నా.. మిగతా పార్టీలకు మాత్రం కచ్చితంగా కొత్త ఊరటనిచ్చినట్టే. ప్రత్యేకించి బీజేపీకి! తెరాస, మజ్లిస్ లు జతకలిస్తే.. బీజేపీ గట్టిగా హిందుత్వవాదాన్ని వినిపించే అవకాశం ఉంది. మతపరంగా సెన్సిటివ్ ప్రాంతం అయిన హైదరాబాద్ లో టీఆర్ఎస్- మజ్లిస్ లు జత కలిస్తే.. బీజేపీ రెచ్చిపోతుంది. వారు హైందవ ద్రోహులు.. మీరు మాకే ఓటేయాలని హిందుత్వ వాదాన్ని వినిపిస్తుంది. మరి ఒకరకంగాచూస్తే.. తెరాసకు ఈ నష్టాన్ని భరించాల్సిన అవకాశం కూడాఉంటుంది.మరి ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత ఏమనుకొంటున్నాడో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -